Home » Jagan Mohan Reddy
కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ(AP Finance Secretary Satyanarayana)కు రాష్ట్ర ప్రభుత్వం(AP government) ఝలక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar) ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.
క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయడమే కాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్, ఆయనకు సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద అక్రమ కట్టాడాలను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం కూల్చివేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.
అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని (Kodali Nani) అనలేదా అని ప్రశ్నించారు.
వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు.