TDP: జగన్ చెప్పినట్లే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి: నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Jun 05 , 2024 | 07:19 PM
వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు.
అమరావతి: వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan Reddy) చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమని చెప్పారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించారన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటని అన్నారు.
నీతిలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే అని దెప్పిపొడిచారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రజలే జగన్ రెడ్డి మోసం చేశారంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అమ్మఒడి ఇచిన అమ్మలు, అవ్వతాతలు మోసం చేశారనడం దారుణమన్నారు. వైసీపీ ప్రత్యేహోదా సాధించలేదు, సీపీఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ లేదు అందుకే ప్రజలు వైసీపీకి సరైన తీర్పును ఇచ్చారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసినందుకే ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలపై హత్యలు, అత్యాచారాలు, అరాకాలపై జగన్ రెడ్డి నోరు మెదపనందుకే ఈ తీర్పు ఇచ్చారన్నారు. రాజధాని పేరుతో మూడుముక్కలాట ఆడినందుకే జనం ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు. పోలవరాన్ని ముంచింనందుకే వైసీపీని పాతిపెట్టారన్నారు.
పంచాయతీలను నిర్వీర్యం చేసిన సర్పంచ్‌లను అడుక్కునేలా చేసినందుకే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి.. ల్యాండ్, మైన్స్, వైన్స్ శ్యాండ్‌తో దోచుకున్నందుకు ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. ఈవీఎంల తీర్పుపై వైసీపీ నేతల మాటలు ప్రజాస్వామ్య తీర్పును కించపరచడమేనని చెప్పారు. ఇప్పటికైనా నిరంకుశ విధానం వదిలి జగన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. వైసీపీ నేతలు మారాలని నిమ్మల రామానాయుడు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం
YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!
AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?
For More Andhra Pradesh News and Telugu News..