Home » Jagan Mohan Reddy
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి టీడీపీ(TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. బాబు ఈ నెల 7న ఆచంట రానున్నట్లు తెలిపారు.
జనవరి ఒకటో తేది ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి చివరి రోజు అని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే రోజులు దగ్గర పడ్డాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణకు జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు.
ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Btech Ravi: పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. నిశ్శబ్ద విప్లవం బహిరంగ విప్లవమవుతోందని టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
AP Politics: వచ్చే ఏడాది మార్చిలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం జగన్ అన్నారు.
Janasena Party: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ గురువారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ చేసింది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయని జనసేన పార్టీ ఎద్దేవా చేసింది.
ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాల ఆదుకుంది తెలుగుదేశం పార్టీనే అని (TDP AP President Achchennaidu) ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ...
తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. తుపాన్ పరిస్థితులపై అధికారులను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు.