Home » Jagan Mohan Reddy
Liquor Rates Hike In Andhra Pradesh : వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధిస్తామని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇదే మద్యాన్నే ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు..
ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ సూటిగా ప్రశ్నించారు.
ముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు.
జగన్ సర్కారు గొప్పగా చెబుతున్న నవరత్నాలు ఆదుకోలేకపోయాయి. బటన్ నొక్కుడుతో డబ్బుల పంపిణీ వలసలను నివారించలేకపోయింది.
ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో.. రూ.43 కోట్ల సొమ్ము ఖర్చుపెట్టి సీఎం జగన్ లండన్ వెళ్లాల్సిన అవసరమేంటని ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీ దాటి వారం గడిచినా రాష్ట్రంలో టీచర్లు, 108 ఉద్యోగులు, 104 ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సీఎం సారు మాత్రం ఖరీదైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ వాళ్లను ఏమార్చేందుకు తనకు తెలిసిన రీతిలో కుయుక్తులు పన్నుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా పేరుతో కొన్ని రోజుల గ్యాప్‌లో వరుస సర్వేలతో హడావిడి చేస్తోంది. గతంలో ఎన్డీటీవీ పేరుతో ఓ సర్వేను.. తాజాగా టైమ్స్ నౌ పేరుతో ఓ సర్వేను విడుదల చేసి మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే రీతిలో ప్రజలను మభ్యపెట్టింది.
తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో ‘ఎందరో మహానుభావులు.. ఒక్కరే ‘చీప్’ మినిస్టర్ అంటూ లోకేష్ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ఏపీకి సేవలు అందించిన మాజీ సీఎంలందరూ ఒకవైపు ఉండగా.. సందర్భం ఏదైనా వెకిలి నవ్వులు చిందించే జగన్ మరోవైపు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అంటూ లోకేష్ సదరు ఫోటోకు క్యాప్షన్ పెట్టారు.
ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని కొంత కాలంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో టిక్కెట్ రేట్స్‌ను తగ్గించి పరిశ్రమను ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేసింది. వినోదాన్ని సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యమని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి కూడా చిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ ట్వీట్‌పై టాప్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి అని తెలిపారు.
అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతోందని మాజీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులోని కరకకంబాడిలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీని..