Home » Jagitial
రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. తెలంగాణ వాటాలపై పార్లమెంట్లో ఒక్కరోజైనా కొట్లాడారా?
జగిత్యాల: దొరల తెలంగాణకు.. ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన జగిత్యాలలో పర్యటిస్తున్నారు.
జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
మోదీ నువ్వు గాంధీని పూజిస్తావా..? గాడ్సే ను పూజిస్తావా?, నిజామాబాద్‌లో చెప్పి వెళ్ళు. గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తారా..? కాంగ్రెస్ హయాంలో కరెంటే లేదు.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. చంపింది చెల్లెనే అని, చున్నీతో గొంతు నులిమి చంపారని ఆయన తెలిపారు. ఉమర్‌ను కోరుట్ల రమ్మని చందనే కోరిందని, దీప్తి, చందన ఇద్దరూ మద్యం తాగేలా ప్లాన్ చేసి.. చందన, ఉమర్ డబ్బు, నగదుతో పారిపోవాలని చూశారని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వివరించారు.
కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిజమైన దళిత ద్రోహి అని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి(MLC T Jeevan Reddy) విమర్శించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మందు, మాంసంతో వేడుకలు జరుపుకున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు.
జగిత్యాల: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు.