Home » Janasena
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ నేరుగా వైజాగ్ వెళ్లారు. అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకున్నారు. ఆర్భాటం లేకుండా పవన్ విశాఖ టూర్ కొనసాగుతోంది. పార్టీ నేతలను సైతం తనతో రావద్దని ఆయన సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు.. ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు..
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు...
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..
దేశానికి మోదీ ఒక స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మోదీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో ఏపీలో అద్భుత విజయం సాధించామన్నారు. మోదీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తమ పూర్తి మద్దతును పవన్ తెలిపారు
ఈ పట్టణాన్ని అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడం ప్రజలకు ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.