Home » JDU
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ప్రతిపక్ష కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థులు పెరిగిపోతున్నారు. పాట్నా, బెంగళూరు తర్వాత ముచ్చటగా మూడోసారి ముంబైలో సమావేశమవబోతున్న ఈ పార్టీల నేతలు తమ అధినేత ఆ పదవికి తగినవారని ప్రకటనలు ఇస్తున్నారు.
బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో సమావేశం అవుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. మరికొన్ని విపక్ష పార్టీలు కూడా 'ఇండియా' కూటమిలో చేరబోతున్నాయంటూ అటు జేడీయూ, ఇటు కాంగ్రెస్ బహిరంగంగానే ప్రకటించడంతో ఏయే పార్టీలు ముంబై మీట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే హాట్‌హాట్ చర్చ మొదలైంది.
ప్రముఖ హిందీ దినపత్రికలో పని చేస్తున్న పాత్రికేయుడు విమల్ కుమార్ శుక్రవారం ఉదయం దారుణంగా హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. కుల ప్రాతిపదికన (caste-based) సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం తోసిపుచ్చింది.
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు జాతీయ అభివృద్ధి సమ్మళిత కూటమి (ఇండియా) పేరు విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారంటూ వచ్చిన ఊహాగానాలను జేడీయూ నేతలు కొట్టిపారేశారు. విపక్ష నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించిన వారిలో నితీష్ ఒకరని, ఆయనకు ఎలాంటి ఆగ్రహం లేదని తెలిపారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో పోస్టర్లు వెలిశాయి.