Home » Jharkhand
సుమారు 20 ఏళ్ల క్రితం శిబు సోరెన్ తండ్రి కూడా కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి కలకలం రేపారు.
జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించి మనీల్యాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేయవచ్చనే భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీకి చేరుకున్నారు.
భారత్‌లోని మహిళలకు వృద్ధ అత్తమామలకు, అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు(Jharkhand High Court) పేర్కొంది. వృద్ధ అత్తమామలకు సేవ చేయడం భారత దేశ సంప్రదాయాల్లో ఉందని వివరించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) శనివారం ఈడీ(ED) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరెన్ అభిమానులు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేవుడిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి శ్రద్ధలు చాటుతారు. అయితే అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) గురించి ఓ వృద్ధురాలు వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కి చెందిన 85 ఏళ్ల సరస్వతీ దేవీ 1990 నుంచి మౌనవ్రతం చేస్తూ రాముడిపై తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ప్రభుత్వం చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పరిస్థితిపై చర్చించేందుకు అధికార జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పనా సోరెన్‌కు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పన సోరెన్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టనున్నారా? అవునంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోమవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వృధ్ధాప్య పింఛన్ల విషయంలో జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 60 ఏళ్లు ఉన్న పింఛన్ అర్హత వయస్సును కాస్తా ఏకంగా 10 ఏళ్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జార్ఖండ్‌లో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాల్లో నిర్వహించిన దాడుల్లో నోట్ల గుట్టలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఒకటే విమర్శల మోత..