Jharkhand: అయోధ్య కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం.. ఆసక్తిరేపుతున్న వృద్ధురాలి జీవితం
ABN , Publish Date - Jan 11 , 2024 | 10:11 AM
దేవుడిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి శ్రద్ధలు చాటుతారు. అయితే అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) గురించి ఓ వృద్ధురాలు వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కి చెందిన 85 ఏళ్ల సరస్వతీ దేవీ 1990 నుంచి మౌనవ్రతం చేస్తూ రాముడిపై తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంది.
రాంచీ: దేవుడిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి శ్రద్ధలు చాటుతారు. అయితే అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) గురించి ఓ వృద్ధురాలు వినూత్నంగా తన భక్తిని చాటుకుంది. జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కి చెందిన 85 ఏళ్ల సరస్వతీ దేవీ 1990 నుంచి మౌనవ్రతం చేస్తూ రాముడిపై తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆమె తెలిపింది. సుప్రీంకోర్టులో అయోధ్యకు అనుకూలంగా తీర్పు రావడం, అయోధ్యలో ప్రధాని మోదీ ఆలయ శంకుస్థాపన చేయడంతో ఆమె ఇటీవలే వ్రతాన్ని వీడింది. ఈ క్రమంలో ఆమె కుటుంబం ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది. ఆమె స్వరం వినడం కోసం కుటుంబసభ్యులు ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారు కోరుకున్న సమయం రానేవచ్చింది.
ఆమె మౌనవ్రతం చేస్తున్నన్ని రోజులు రాముడి చరిత్ర, తిరుపతి వేంకటేశ్వరుడు, కాశీ తదితర ఆలయాల విశేషాలను తెలుసుకుంటూ గడిపినట్లు వివరించింది. అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందిందని.. దాన్ని దేవుడి పిలుపుగా భావించి వ్రతాన్ని వీడుతున్నట్లు భక్తురాలు తెలిపింది.