High Court: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు.. అత్తను పట్టించుకోకపోతే ఇక అంతే
ABN , Publish Date - Jan 25 , 2024 | 11:35 AM
భారత్‌లోని మహిళలకు వృద్ధ అత్తమామలకు, అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు(Jharkhand High Court) పేర్కొంది. వృద్ధ అత్తమామలకు సేవ చేయడం భారత దేశ సంప్రదాయాల్లో ఉందని వివరించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రాంచీ: భారత్‌లోని మహిళలకు వృద్ధ అత్తమామలకు, అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు(Jharkhand High Court) పేర్కొంది. వృద్ధ అత్తమామలకు సేవ చేయడం భారత దేశ సంప్రదాయాల్లో ఉందని వివరించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన అత్తమామలకు సేవ చేయడం కోడలు బాధ్యత, అదొక సాంస్కృతిక ధర్మం అని వివరించింది.
అత్తమామల నుంచి విడిపోయి భార్య వేరేకాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్ చంద్ స్పష్టం చేశారు. కారణం లేకుండా భర్త నుంచి విడిపోతే మనోవర్తి పొందే హక్కు భార్యకు ఉండదని వెల్లడించారు. తనను అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని.. అందుకే భర్తతో విడాకులు కావాలని కోరుంటున్నట్లు భార్య ఫ్యామిలీ కోర్టులో చెప్పింది.
ఈ కేసును విచారించిన డుమ్కాలోని ఫ్యామిలీ కోర్టు భార్యకు రూ.30 వేలు, కుమారుడికి రూ.15 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఆయన ఈ తీర్పును జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ తీర్పు చెప్పడం విశేషం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి