Home » Jharkhand
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.
ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నివాసం కల్పిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారికి పాలక కూటమి జేఎంఎం-కాంగ్రె్స-ఆర్జేడీ పార్టీలు అండగా ఉన్నాయన్నారు.
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ రాష్ట్రంలో గెలుపుపై ఇప్పటికే నమ్మకం కలిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పారు.
ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు.
జార్ఖండ్‌లో ఎన్నికల టైం దగ్గర పడింది. ప్రధాన పార్టీల నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు కీలక హామీలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఝార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.