Home » Joe Biden
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎంత భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయనపై ఈగ కూడా వాలనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస చోరీలు జరుగుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా(america)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(us president elections) జరగనున్నాయి. దీని కోసం అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య రసవత్తరమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (Joe Biden) ఈ ఏడాది చివరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఆయన నామినేట్ అయ్యారని అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడానికి 1,968 మంది ప్రతినిధుల ఓట్లు అవసరమవ్వగా తాజాగా జార్జియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ అర్హత సాధించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas War) మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు.. అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్‌కే (Israel) మద్దతు తెలిపింది. ఆ దేశానికి తనవంతు సహకారం అందించింది. కానీ.. గాజాలో (Gaza Strip) అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో, అమెరికా స్వరం మారింది. క్రమంగా ఆ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ తీరుని తప్పుపడుతూ వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పోటీ నిర్ణయించబడిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ బైడెన్‌కు ఛాలెంజ్ విసిరారు.
అమెరికా(america) అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్(donald Trump) ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ట్రంప్ మరో 3 రాష్ట్రాలలో ప్రత్యర్థి నిక్కీ హేలి(nikki haley)ని ఈజీగా ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయం తీసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా (America), రష్యా (Russia) మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందన్న విషయం అందరికీ తెలుసు. తమదే ఆధిపత్యం సాగాలన్న ధోరణిని ఆ రెండు దేశాలు కనబరుస్తుంటాయి. అందుకే.. తరచూ పరస్పర విమర్శలు చేసుకుంటుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Vladimir Putin) నోరు పారేసుకున్నారు.
జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జినీయా అటార్నీ జనరల్, రిపబ్లిక్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ శారీరకంగా, మానసికంగా అంతా ఫిట్‌గా లేరని స్పష్టం చేశారు.
హెచ్-4 వీసాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వారికి ఊరటనిచ్చే ఒక శుభవార్తను అమెరికా ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘సెనెట్’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో.. సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ది చేకూరుతుంది.