Joe Biden: బైడెన్ ఫిజికల్లీ, మెంటలీ అన్ ఫిట్.. అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించండి
ABN , Publish Date - Feb 14 , 2024 | 01:45 PM
జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జినీయా అటార్నీ జనరల్, రిపబ్లిక్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ శారీరకంగా, మానసికంగా అంతా ఫిట్‌గా లేరని స్పష్టం చేశారు.
వాషింగ్టన్: జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జినీయా అటార్నీ జనరల్, రిపబ్లిక్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ (Biden) శారీరకంగా, మానసికంగా అంతా ఫిట్‌గా లేరని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడిన వీడియోలు, నడిచే సమయంలో దొర్లిన ఫుటేజీ వైరల్ అయ్యాయని గుర్తుచేశారు. జో బైడెన్‌ను 25వ సవరణ ద్వారా పదవి నుంచి తొలగించాలని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు సూచించారు. ఈ మేరకు హారిస్‌కు లేఖ రాశారు.
ఇటీబల బైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన నివేదికను వైద్యులు అందజేశారని మోరిసే గుర్తుచేశారు. బైడెన్‌కు జ్ఞాపకశక్తి ఉండటం లేదని నివేదికలో పేర్కొన్నారని వివరించారు. గత కొన్నాళ్లుగా జ్ఞాపకం సరిగా లేని వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బహిరంగ సమావేశాలు, విదేశీ ప్రతినిధులతో బైడెన్ వ్యవహరించిన తీరుతో దేశం పరువు పోయింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ కొనసాగడం మంచిది కాదని మోరిసే తేల్చిచెప్పారు. అమెరికాకు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అధ్యక్షుడు కావాలని మోరిసే అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.