Home » JP Nadda
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.
మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.
బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసాగించారన్నారు. ఇప్పుడు ఆ పదవీకాలం పూర్తయిందన్నారు. అధ్యక్ష మార్పు అనివార్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను క్యాబినెట్లోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తిదాయకంగా మారింది.
దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను తప్పించి ఆ స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.