Share News

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

ABN , Publish Date - Oct 26 , 2024 | 09:22 PM

మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గోనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందుగా జాబితాను విడుదల చేసి, ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ (BJP) అదే వేగంతో హేమాహేమీల్లాంటి స్టార్ క్యాంపెయినర్లను (Star Campaigners) రంగంలోకి దింపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ జగత ప్రకాష్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సహా 40 మంది అగ్రనేతల జాబితాను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది.

Maharshta Elections: పోటీలో లేని ఆప్... 'ఇండియా' కూటమి అభ్యర్థులకు కేజ్రీవాల్ ప్రచారం


కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, భూపేంద్ర యాదవ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ప్రమోద్ సావంత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తదితరులు ఎన్నిల ప్రచారంలో పాల్గొంటారు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్, వినోద్ తవాడే, నారాయణ్ రాణే, పంకజ్ ముండే, చంద్రకాంత్ (దాదా) పాటిల్, గిరీష్ మహాజన్, రాధాకృష్ణ విఖే పాటిల్, ఆశిష్ సెలార్, ఉడయాన్ రాజే భోంస్లే, రావుసాహెబ్ దన్వే పాటిల్, అశోక్ చవాన్, సుధీర్ ముంగంటివార్, నవనీత్ రాణా తదితరులు కూడా విస్తృత ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గోనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


కాగా, జార్ఖాండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా బీజేపీ ఇంతకుముందు ప్రకటించింది. 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం నయబ్ సింగ్ సైని, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి తదితరులు ఉన్నారు. జార్ఖాండ్‌లో రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 26 , 2024 | 09:22 PM