Home » Kakinada
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan)కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetti Subhash) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు.
వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది.
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారు తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్ కు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినా కూడా వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
సినీనటుడు సాయిధరమ్తేజ్పై ఆదివారం రాత్రి వైసీపీ మూకలు డ్రింక్ బాటిల్తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి..
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తూ.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Andhrapradesh: జగ్గంపేట నియోజకవర్గంలో సూరంపల్లి ఆదిత్య కాలేజ్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?! జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యమన్నారు.
పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో 365 ఎకరాల పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ సముద్రం పోటుకు గురవుతోంది. లేఅవుట్ కు అతి సమీపంగా సముద్రం నీరు వచ్చేసింది. పోటు అధికంగా ఉండడంతో ఇళ్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు. స్థలాలు, ఇళ్లకు ఉప్పు నీటి ముప్పు పొంచి ఉండడంతో కలవరం చెందుతున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.