పల్లెలు... డిజిటల్!
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:39 AM
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్‌లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్‌గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్‌లైన్‌లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
ఇక పంచాయతీల్లో సేవలన్నీ ఆన్‌లైన్
జనవరి నుంచి డిజిటలైజేషన్
జిల్లాలో 1103 పంచాయతీలు
స్వర్ణ పంచాయతీల్లో అమలు
ప్రజలకు వేగంగా సేవలు
ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరణపత్రాలు
ఎక్కడి నుంచైనా పన్నులు చెల్లింపు
మారనున్న పంచాయతీ పాలన
కార్యదర్శులకు డిజిటల్ కీ
త్వరగా సర్టిఫికెట్ల జారీ
ప్రపంచం అంతా మారిపోయింది.. డిజిటల్ వైపు పరుగులు పెడుతోంది.. ప్రస్తుతం రూపాయి చెల్లించాలన్నా ఆన్‌లైన్.. అయితే పంచాయతీల్లో మాత్రం ఇప్పటి కింకా పాత పద్ధతే. ఏ సేవ కావాలన్నా మాన్యువల్‌గా దరఖాస్తు చేయాల్సిందే.. వాళ్లూ అదే స్థాయిలో మాన్యువల్‌గా ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో భాగంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1103 పంచాయతీలు ఉండగా అన్నింటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఏ సేవ అయినా ఆన్‌లైన్‌లోనే. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరునున్నాయి.. ఈ సేవలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి.
కార్పొరేషన్(కాకినాడ)/మండపేట, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ఇకపై డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అంద నున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు రెండు, మూడు రోజుల్లోనే జారీ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను చెల్లించొచ్చు.. వ్యాపార లైసెన్సులు పొందొచ్చు..వీటికి సంబంధించి కార్య దర్శులకు డిజిటల్ కీ అందుబాటులోకి రానుం ది.దీంతో ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా ఆన్ ‘లైన్‌క్లియర్’గా ఉండనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 62 మండలాలు 1103 పంచాయతీలున్నాయి.అన్ని పంచాయతీల్లో కొత్త విధానా న్ని అమలు చేయనున్నారు. పంచాయతీలు జారీ చేసే వివిధ ధ్రువీకరణ పత్రాలకు నిరీక్షించాల్సిన అవసరంలేదు. సులభంగా సర్టిఫికెట్లు పొందేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కొత్తవిధానానికి శ్రీకా రం చుట్టింది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని కార్యదర్శులు పరిశీలించి డిజిటల్ సంతకాలు చేస్తారు. అనంతరం మీసేవ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.
కొత్త విధానం ఇలా..
పంచాయతీల ద్వారా జనన,మరణ ధ్రువీకర ణ పత్రాలను మాన్యువల్ పద్ధతిలోనే జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందులో నమోదు చేసిన ఫోన్ నెంబర్‌కి దరఖాస్తు సంఖ్య మెసేజ్ రూ పంలో వస్తుంది. పత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది.కొత్త విధానం అమల్లో కి రావడంతో పంచాయతీలకు వెళ్లాల్సిన అవస రం లేకుండా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. రెండు, మూడ్రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
ఎక్కడి నుంచైనా చెల్లింపులు..
ప్రపంచంలో ఎక్కడ, ఏమూల ఉన్నా మీ సొం త ఊళ్లోని మీ ఇంటికి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు వెళ్లనక్కర్లేదు. ఉన్నచోటు నుంచే నేరుగా ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో భాగంగా డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇలా పలు సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ఈమేరకు పంచాయతీల్లో పాయిం ట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాలు సిద్ధం చేస్తున్నారు. వీటితో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బకాయిలు చెల్లించచ్చు. మరికొన్ని చోట్ల క్యూఆర్ కోడ్ ద్వారా పన్ను బకాయిలు వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఆయా పంచాయతీల పీడీ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
తొలి దశలో ముఖ్యమైన సేవలు
పంచాయతీల్లో తొలిదశలో ముఖ్యమైన సేవ లు ఆన్‌లైన్‌లోనే అందించనున్నారు. ఆస్తి విలువ ధ్రువీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సులు జారీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, సూక్ష్మ చిన్న తర హా పరిశ్రమల ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణపత్రాలు, భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్‌లైన్‌లో అందించనున్నారు. పంచాయతీల్లో అందించే 80 సేవలను క్రమంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో అందుబాటులో పెట్టనున్నారు. దీంతో గ్రామీణ ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు 80 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి.
కార్యదర్శుల వివరాలు సేకరణ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 62 మండలాలు 1103 పంచాయతీలున్నాయి. అన్ని పం చాయతీల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలను బయోమెట్రిక్‌తో నమోదు చేశారు. డిజిటల్ టోకెన్లను జారీ చేయడానికి కార్యదర్శుల డిజిటల్ సంతకాలు, వివరాలను కంప్యూటర్ ఆపరేటర్ సేకరించారు. ప్రతి కార్యదర్శికి సంబంధించి సమగ్ర వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ సంతకాల సేకరణ పూర్తి కాగా కార్యదర్శులకు డిజిటల్ కీలను జిల్లా ఉన్నత అధికారులు అందజేశారు.