Home » Kejriwal Arrest
అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది.
ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.
ఒక్కో దశ పోలింగ్ ముగిసేకొద్దీ ఇండియా కూటమి విజయానికి మరింత చేరువ అవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘‘మోదీ పతనం ఖాయం. ఈ విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుంది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది.
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది.
తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదని అనుకుంటే చీపురుకట్ట గుర్తుకు ఓటేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలను కోరారు. గురువారం అమృత్‌సర్‌లో జరిగిన రోడ్డు షోలో ఆయన ప్రసంగిస్తూ తాను జైలుకు వెళ్లాలా, వద్దా అన్నది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.