Imran Khan :కేజ్రీవాల్‌కు అక్కడ బెయిల్ ఇక్కడ నాకేమో వేధింపులు
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:53 AM
అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.
పాక్ సుప్రీంకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు
ఇస్లామాబాద్, జూన్ 7: అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు.
గురువారం పాక్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ 2022 ఏప్రిల్‌లో పదవి నుంచి తొలగించిన దగ్గర నుంచి తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా భారత సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. తనను మాత్రం ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగుతాయనగా 5 రోజుల ముందు దోషిగా ప్రకటించి అరెస్టు చేశారని చెప్పారు. దేశంలో అప్రకటిత మార్షల్ లా అమలవుతోందనిఆరోపించారు.