Home » Kejriwal
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శనివారం కోర్టు ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని, ఎన్నికల సమయంలో మాత్రమే కమలం పార్టీకి ఇలాంటి విషాలు గుర్తుకు వస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళలందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించింది. అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓట్ల కోసం తాయిలాన్ని ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడు, నాలుగు రోజుల్లో అరెస్ట్ చేస్తారని మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణం తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమేనని వివరించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ సమన్లు ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిబ్బంది వివరాలు వెల్లడించింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సీనియర్ నేత, మంత్రి ఒకరు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంత్రి అతిశీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.