Home » Khammam
వారంతా ప్రభుత్వ ఉద్యోగులే.. కానీ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు. కూలీలుగా పని చేస్తున్నట్లు జాబ్ కార్డులు సృష్టించి.. డబ్బును స్వాహా చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో గత రెండేళ్లుగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చింతకాని మండలం పొద్దుటూరు (Podhuturu) గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్(Bojedla Prabhakar) ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
అమెరికాలో ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎన్నారైలు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు.
మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం నిర్వహించిన సమీక్షలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పిడుగుపాటు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు.
భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆంఽధ్రప్రదేశ్‌ను కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టం హామీల అమలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై జరిగే ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతమైంది. గురువారం బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి లిఫ్ట్ పంప్ హౌస్‌లోని ఆరు మోటార్లలో ఒకదానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, సీతారామ ఎత్తిపోతల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి స్విచాన్ చేశారు.