Home » Kolkata
జూనియర్ డాక్టర్‌పై కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన హత్యాచారానికి నిరసనగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగాజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో చట్టం లేదని లేకుండా పోయిందని మండిపడ్డారు. ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆందోళనకు దిగిన వైద్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎదుట ‘వైద్యులు’ తమ ఆరు డిమాండ్లను ఉంచారు. ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డాను డిమాండ్ చేశారు.
ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు.
కోల్‌కతా(Kolkata)లోని ఆర్జి కర్ ఆస్పత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ప్రధాని మోదీ(modi) ఎర్రకోట నుంచి ప్రసంగించిన క్రమంలో దేశవ్యాప్తంగా మన కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిలో భయాందోళనలు నెలకొనాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీ కర్ వైద్యకళాశాల ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని దుండగులు ఆస్పత్రిలో పెను విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల ముసుగులో ఆ పరిసరాల్లోకి వచ్చిన గూండాలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కేంద్ర భద్రత దళాలను మోహరించాలని ఢిల్లీలోని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భ్లలాతోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ నేత, ఎమ్మెల్యే సువేందో అధికారి విజ్ఞప్తిచేశారు.
ఆగస్ట్ 8వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఆ విద్యార్థి విధులకు హాజరయ్యే ముందు తన డైరీలో ఏం రాసుకుందో ఆమె కన్నతండ్రి గురువారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో వివరించారు. వైద్య వృత్తిలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అంకితభావంతో సాధించాలని స్పష్టం చేసిందన్నారు.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ వైద్యకళాశాల ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలి (31)పై అత్యాచారం, హత్య ఘటనకు దిగ్ర్భాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక