Home » Kolkata
కోల్కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోల్కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అంశంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కోల్కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అసలు విషయం బయటకు రావడంలేదు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు.
పశ్చిమబెంగాల్లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.