Home » Komati Reddy Venkat Reddy
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.
గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. ఆ కారణంగానే పదోన్నతులు, బదిలీల వ్యవహారం శాఖలో కొలిక్కి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గం తవ్వకం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రీన్ చానెల్ ద్వారా రూ.2,200 కోట్ల నిధులు సమకూరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణం వైద్య సాయం అందేలా కొర్లపహాడ్ టోల్‌ప్లాజా ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ట్రామా కేర్ సెంటర్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
‘‘హైదరాబాద్ అంటే బిర్యానీకి మాత్రమే కాదు.. బయో ఫార్మా పరిశ్రమకూ ప్రసిద్ధి చెందింది. బిర్యానీలో మసాలాలు ఎంత కీలకమో.. బయో ఫార్మా రంగంలో కొత్త ఆవిష్కరణలు అంతే కీలకం. పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందితే.. ఫార్మా రాజధానిగా హైదరాబాద్ ఖ్యాతి పొందింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
నల్లగొండ పట్టణ నడిబొడ్డులో రూ.100 కోట్ల విలువైన స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ వెంటనే నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.