Komatireddy: ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jul 15 , 2024 | 06:34 PM
ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
మహబుబ్ నగర్ జిల్లా (జడ్చర్ల): ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భారీ అప్పుల ఊబిలో నెట్టివేశారని ఫైర్ అయ్యారు.
ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వంలో మొదటి తారీఖున జీతాలు వేస్తున్నామని గుర్తుచేశారు. మహబుబ్ నగర్ జిల్లా ప్రజలను మోసం చేసి పక్క రాష్ట్రాలకు పంపి వారిని లేబర్‌గా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో కట్టిన ఒక్క ప్రాజెక్టు పాలమూరుకు ఉపయోగ పడలేదని మండిపడ్డారు.
మహబుబ్ నగర్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. 0 బిల్లులతో ప్రతి పేదవాడికి కరెంట్ బిల్లులు లేకుండా చేస్తున్నామని వివరించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచే ప్రతి పేదవాడికి రూ. 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించారు.