Home » Kotamreddy Sridhar Reddy
ల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసు బనాయించింది.
మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.
నెల్లూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు.
నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు.
ఆటో డ్రైవర్లు, యజమానులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపరీతంగా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.
ఇటీవలి కాలంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే పార్టీ తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి వచ్చేసింది...
Andhrapradeshh: అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించి చివరకు విచారణకు వెళ్లాలని నిర్ణయించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఎమ్యెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.