Home » KTR
రేవంత్ ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 పరీక్షలు(Group 1 Exams) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్(BRS) నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన నినాదం గుర్తుందా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదని తామన్నామని, ఇప్పుడు అదే అక్షర సత్యం అయిందని విమర్శించారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వానాకాలం పంట సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని నిర్ణయించింది. వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం అంటే మోసం చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయే వారి కోసం మూడు నెలలు కాదు.. మూడేళ్లు కూడా మూసీ పక్కన ఉండేందుకు సిద్ధం.
అన్నివర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని అన్నారు.
నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు చూశారని అన్నారు.నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.. బండి సంజయ్‌ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి రేవంత్ ర్యాలీ చేయిస్తాడని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రమే రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు.