Home » Kuwait
ప్రవాసులకు కువైత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు (Expats) ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. వలసదారుల రెసిడెన్సీ చట్టాన్ని (Expats Residency Law) సవరించే బిల్లును పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ అఫైర్స్ కమిటీ ఆమోదించింది.
కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది.
NRI News: గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక పెనాల్టీలు కూడా అదే స్థాయిలో భారీగానే ఉంటాయి. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలపై ఎంతోకొంత అవగాహన ఉండడం తప్పనిసరి.
గల్ఫ్ దేశం కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పుల్ (Swimming Pool) లో మునిగి చనిపోయాడు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కువైత్‌లోని వలసదారులలో భారతీయ ప్రవాసులే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసాల విషయంలో గల్ఫ్ దేశం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ భారత్ నుంచి ఆ దేశానికి ప్రతియేట భారీ సంఖ్యలోనే ఉపాధి కోసం వెళ్తున్నారు.
Open House Meeting for Indians: కువైత్‌లోని భారత ఎంబసీ (Embassy of India) బుధవారం (డిసెంబర్ 6వ తారీఖున) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్ (Open House Meeting) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
అల్-ఖువైసత్ ప్రాంతంలో ముఖ్యంగా సుబియా వంతెన చుట్టూ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు, అనధికారికంగా వాహనాల అద్దె కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి కోసం జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.
బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ని నిర్వహించడం జరిగింది.