Home » Lasya Nanditha
లాస్య నందిత కారు ప్రమాదం ఘటనపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 304(ఏ) ఐపీసీ సెక్షన్ కింద ఆకాశ్‌పై కేసు పెట్టామని వెల్లడించారు. కారు ప్రమాద ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిక స్పందించారు. సదాశివపేటలో పూజలు ముగించుకొని తిరిగి బోయిన్‌పల్లికి వచ్చామని, ఆకలి అవుతుండడంతో ఏమైనా తీసుకొస్తానని చెప్పి లాస్య అక్క వెళ్లిందని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita) భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు ఉన్నారు.
#RIP LasyaNanditha బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) దుర్మరణంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది..? అసలు ఈ ఘటనకు ముందు ఏం జరిగింది..? లాస్య ఎక్కడికెళ్లి తిరిగొస్తున్నారు..? మార్గమధ్యలో ఏదైనా జరిగిందా..? ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి...
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. కారు ప్రమాద మరణాలకు ముఖ్య కారణం. పోలీసులు సైతం సీటు బెల్ట్ ధరించకుంటే ఫైన్ వేస్తామని చెబుతున్నా సరే.. మన చెవులకు వినిపించదు. ఇలా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదంలో మరిణించిన వారి లిస్ట్ చాలా పెద్దదే. కారు ఉన్న ప్రతి ఒక్కరికీ సీటు బెల్ట్‌పై పక్కాగా అవగాహన ఉంటుంది.
Lasya Post Mortem Report హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి..
Telangana: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
Lasya Nanditha Dies In Road Accident: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, ఎమ్మెల్యే పీఏ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ప్రమాదం ఎప్పుడు.. ఎలా జరిగింది..? అనే విషయాలపై ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను అడిగి పోలీసులు ఆరా తీశారు..
#RIPLasya Nanditha: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు...
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం దుర్మరణం పాలైన ఘటన తెలంగాణలో సంచలనం రేపుతోంది. తెల్లవారుజామునే కావడంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి విషయాలైతే తెలియడం లేదు. కారును పూర్తిగా పరిశీలించి పోలీసులు ఇప్పుడిప్పుడే ఓ అంచనాకు పోలీసులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య నందితకు ఎమ్మెల్యే గా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.