Home » Latest News
KTR:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ కార్ రేసును ఓ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది.
E Car Race Scam: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నారు. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళతారా? లేక అరెస్టవుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు 105.39 టీఎంసీలకు పడిపోయాయి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
అభయహస్తం ద్వారా మహిళలు జమచేసిన రూ.385 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.