Home » Lok Sabha Election 2024
మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. అజిత్ పవార్ సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనేతోపాటు యష్ సానే, రాహుల్ బోంస్లే, పంకజ్ బాలేఖర్లు బుధవారం రాజీనామా చేశారు.
కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ముగిశాయి. లోక్‌సభలో సభ్యులు ప్రమాణం సైతం పూర్తయింది. అయితే తాజా ఎంపీలకు అధికారిక బంగ్లాలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్‌గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్‌లను నియమించింది.
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.