Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీకి సంధించిన ‘10 అంశాలు’
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:06 PM
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
న్యూఢిల్లీ, జులై 09: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన పీఠమెక్కి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ నెల రోజుల్లో మోదీ పాలనలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న 10 కీలక అంశాలు... రైలు ప్రమాదం, నీట్ పేపర్ లీక్, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు.. ఇలా పలు అంశాలను కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రస్తావించింది.
Also Read: SIT's Report: హాత్రాస్ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!
1) పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం
2) జమ్మూ కశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాద దాడులు.. 8 మంది సైనికులు మృతి, 10 మంది ప్రజలు దుర్మరణం
3) నీట్ పేపర్ లీక్
4) నీట్ పీజీ రద్దు
5) యూసీజీ, నెట్ పేపర్ లీక్
6) జాయింట్ సీఎస్ఐఆర్ - నెట్ రద్దు
7) పాలు, కూరగాయాలు, పప్పులు, ఉప్పులు, గ్యాస్ ధరలు ఆకాశానంటాయి.
8) రికార్డు స్థాయిలో రూపాయి పతనమైంది.
9) నిరుద్యోగం ఈ ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయిని తాకింది.
10) ‘ద్రవ్యోల్బణం’ గత 15 నెలల రికార్డును బద్దలు కొట్టింది.
Also Read: Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఎన్డీయేకు పట్టం కట్టారు. దీంతో వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్రమోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లోక్‌సభలో మొత్తం 543 స్థానాలున్నాయి. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో తమ పార్టీ 400కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని బీజేపీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేసుకుంది. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి జస్ట్ 240 స్థానాలను గెలుచుకుంది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 293 స్థానాలు గెలవాల్సి ఉంది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జేడీ(ఎస్), జేడీ(యూ) ఎల్‌జేపీ (పాశ్వాన్) పార్టీల మద్దతుతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు ఇదే ఎన్నికల్లో ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాలను గెలుచుకొని.. దశాబ్దం అనంతరం ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. మరోవైపు.. దేశంలో వరుసగా మూడు సార్లు ప్రధాని పీఠం ఎక్కిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ కావడం గమనార్హం.