Share News

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

ABN , Publish Date - Jul 14 , 2024 | 06:06 PM

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది.

LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్

న్యూఢిల్లీ, జులై 14: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్‌ను నియమించింది. ఇక సభలో చీఫ్ వీప్‌గా కొడిక్కినల్ సురేష్‌‌ను, అలాగే వీప్‌లుగా మాణిక్కం ఠాగూర్, జావేద్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్ ఆదివారం ఎక్స్ వేదికగా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక వీరి నియమాకాన్ని ఉంటంకిస్తూ.. లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సలహాలు, సూచనలతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలపై గళమెత్తుతాయని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

Also Read: Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ

Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం


మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా గెలిచిన విశాల్ పాటిల్.. సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. కానీ ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఒకదానికి రాహుల్ రాజీనామా చేయాల్సి ఉంది. దాంతో వయనాడ్‌కు ఆయన రాజీనామా చేశారు.

Also Read: BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!

Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు


దాంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి 99 స్థానాలకు పరిమితమైంది. ఇక ఈ సంఖ్య బలంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. దాదాపు దశాబ్దం అనంతరం ఆ పార్టీ ఈ హోదాను దక్కించుకోవడం గమనార్హం. ఆ క్రమంలో సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఇంకోవైపు వయనాడ్‌కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనుంది. ఆమె బరిలో నిలిచి గెలిస్తే.. ఆ పార్టీ సంఖ్య బలం మళ్లీ 100కి చేరనుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 06:06 PM