Home » Lok Sabha Election 2024
దేశంలో లోక్‌సభ స్పీకర్(Lok Sabha Speaker) అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓటింగ్ జరగనుంది.
లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్.. ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేశారు.
18వ లోక్‌సభ తొలిసమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలి(Raebareli), కేరళలోని వయనాడ్(Wayanad) పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒకరు ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాలి. దీంతో రాహుల్ (Rahul Gandhi) వయనాడ్‌ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై తమిళ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ విశేషాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ప్రచార సమయంలో ఓ వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న దృశ్యాలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండోసారి సాధించిన విజయాన్ని పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నానని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి(Minister G Kishan Reddy) అన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లా ప్రధాని హసీనాకు కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్‌సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్‌సింగ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారాన్ని అందుకున్నారు. ఆ క్రమంలో త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.