Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు
ABN , Publish Date - Jun 25 , 2024 | 04:41 PM
లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్.. ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్.. ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేశారు. ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్ధులో ప్రమాణం చేశారు. గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురాం రెడ్డిలు ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక గోడెం నగేష్ మాత్రం హిందీలో ప్రమాణం చేశారు.
Also Read: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి
అయితే సురేష్ షెట్కర్, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డిలు జై తెలంగాణ అంటూ సభలో నినదించారు. అలాగే ఈటల రాజేందర్ అయితే జై సమక్క సారలమ్మ అని అన్నారు. ఇక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అయితే జై లక్ష్మీ నరసింహ స్వామిని బిగ్గరగా తలుచుకున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య జై భద్రకాళి అని, పి. బలరాం నాయక్ జై తుల్జా భవాని అని, అసదుద్దీన్ ఓవైసీ, మల్లురవి, కావ్య, రఘురాంరెడ్డి జై భీం అని నినదించారు.
Also Read: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ.. జై పాలస్తీన, అల్లాహో అక్బర్ అంటూ తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. దీంతో ఓవైసీ వ్యాఖ్యలపై పలువురు కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ స్పందించారు. నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేరో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి. ఒక స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదన్న విషయం విధితమే. లోక్ సభ సమావేశాలు జూన్ 24న ప్రారంభమైనాయి. ఆ క్రమంలో ఎంపీలు వరుసగా ప్రమాణం చేస్తున్నారు. అందులోభాగంగా నిన్న ఏపీ ఎంపీల ప్రమాణం జరిగింది. రెండోరోజు అంటే నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణం జరిగింది.
Also Read: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట
For Latest News and National News click here