Share News

Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేదెవరు..?

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:01 AM

దేశంలో లోక్‌సభ స్పీకర్(Lok Sabha Speaker) అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓటింగ్ జరగనుంది.

 Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేదెవరు..?
Lok Sabha Speaker 2024 election

దేశంలో లోక్‌సభ స్పీకర్(Lok Sabha Speaker) అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓటింగ్ జరగనుంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, బీజేపీ స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు స్పీకర్ పదవి కోసం తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ప్రకటించాయి.

ప్రొటెం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఎన్డీయే(NDA) మరోసారి ఓం బిర్లా(Om Birla)ను అభ్యర్థిగా నిలబెట్టగా, విపక్షాలు కే సురేష్‌(K Suresh)ను బరిలోకి దింపాయి. దేశచరిత్రలో స్పీకర్ ఎన్నిక జరగడం ఇది మూడోసారి.


స్పీకర్‌ను ఎలా ఎంపిక చేస్తారు?

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక(election) కోసం ఎంపీలు(mps) తమలోని ఇద్దరు ఎంపీలను ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక చాలా సాధారణ మెజారిటీతో జరుగుతుంది. లోక్‌సభలో ఉన్న ఎంపీలలో సగానికి పైగా ఉన్న అభ్యర్థి లోక్‌సభ స్పీకర్ అవుతారు. అంటే ఎవరికి 50 శాతం ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. లోక్‌సభలోని 542 సీట్లలో, NDAకి 293 సీట్లు ఉన్నాయి. విపక్షాలకు సంఖ్యా బలం లేదు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఎన్డీయేకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఓం బిర్లా స్పీకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిర్లా గెలిస్తే రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన తొలి బీజేపీ నేత అవుతారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌కు(congress) చెందిన బలరాం జాఖర్ రెండుసార్లు స్పీకర్‌గా ఉన్నారు.


ఈ ఎంపీలు కీలకం

లోక్‌సభ(Lok Sabha)లో మొత్తం ఎంపీల(mps) సంఖ్య 543. బీజేపీకి(bjp) 240 మంది ఎంపీలు ఉన్నారు. కాగా ఎన్డీయేకు మొత్తం 293 మంది ఎంపీలు కలరు. టీడీపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉండగా, వారిలో కాంగ్రెస్‌కు 98 మంది, ఇతరులకు 14 మంది. లోక్‌సభలో టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉండగా వీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కీలకంగా మారనుంది. దీంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరికీ సపోర్ట్ చేస్తారనేది చూడాలి మరి. స్పీకర్ పేరు ప్రతిపాదనను వాయిస్ ఓటు ద్వారా ఆమోదించవచ్చు. ఓట్ల విభజనపై విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఎంపీలకు ఓటేసేందుకు పేపర్‌ స్లిప్‌లు పంపిణీ చేశారు.


ఇది కూడా చదవండి:

Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్‌

సెన్సెక్స్‌ @ : 78,000


For Latest News and National News click here

Updated Date - Jun 26 , 2024 | 11:09 AM