Home » Lok Sabha Elections
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు.. అటు తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.
ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో (AP Elections 2024) భాగంగా.. 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల (loksabha election 2024) నాలుగో దశ పోలింగ్ ఈరోజు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఎడమ చేతి చూపుడు వేలుకు అధికారులు చెరగని సిరా గుర్తును(election ink) బ్రష్ ద్వారా అంటిస్తారు. అయితే దీనిని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.