Share News

Lok Sabha Election 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ABN , First Publish Date - May 13 , 2024 | 05:43 AM

Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.

Lok Sabha Election 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
Lok Sabha Elections Polling 2024

Live News & Update

  • 2024-05-13T18:01:30+05:30

    • అధిర్ రంజన్ చౌదరి

    • తన సొంత నియోజకవర్గంలో ఓటు వేసిన అధిర్ రంజన్ చౌదరి

    • ఓటు వేసిన తర్వాత సిబ్బందితో మాట్లాడిన అధిర్ రంజన్ చౌదరి

    • ఓటు వేసిన తర్వాత వేలిని చూపిన అధిర్ రంజన్ చౌదరి

  • 2024-05-13T17:56:03+05:30

    • హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి

    • ఓటర్ల గుర్తింపు కార్డులను చెక్ చేయడం సిబ్బంది బాధ్యత

    • తనిఖీ చేసే బాధ్యత పోలీసులకు కూడా లేదు

    • కేసు నమోదు.. విచారణ జరుగుతోంది

    • మాధవీలత పేరు చెప్పకుండా మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాస రెడ్డి

  • 2024-05-13T17:49:38+05:30

    • విక్రమాదిత్య సింగ్ కామెంట్స్

    • హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలిస్తున్నాం

    • భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది

    • ప్రజల అభీష్టం మేరకు పాలన అందజేస్తాం: మండీ లోక్ సభ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్

  • 2024-05-13T17:45:47+05:30

    కశ్మీర్‌లో పోలింగ్

    • చాలా రోజుల తర్వాత కశ్మీర్‌లో ప్రశాంతంగా పోలింగ్

    • ఎలాంటి భయం లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    • గతంలో ఓటు వేసేందుకు భయపడేవారు.

    • కొన్ని సందర్భాల్లో ఓటు వేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు: జమ్ము కశ్మీర్ వక్ఫ్ బోర్డ్ చైర్ పర్సన్, బీజేపీ నేత డాక్టర్ అంద్రాబీ

  • 2024-05-13T17:35:15+05:30

    • ఏపీ, బెంగాల్‌లో హింసాత్మకం

    • ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకంగా మారిన పోలింగ్

    • అదనపు బలగాల మొహరింపు

    • దాడి ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

  • 2024-05-13T17:24:32+05:30

    • సువేందు అధికారి

    • పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీఎంసీ శ్రేణుల ప్రయత్నం

    • టీఎంసీ శ్రేణులను అడ్డుకున్న కేంద్ర బలగాలు: సువేందు అధికారి

  • 2024-05-13T17:06:51+05:30

    • అఖిలేష్ యాదవ్

    • తొలుత ఈవీఎంలు పనిచేయలేవు

    • తర్వాత ఈవీఎంలను మార్చారు. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

  • 2024-05-13T16:48:36+05:30

    ఓటేసిన రాం చరణ్, ఉపాసన

    • జూబ్లీహిల్స్‌లో ఓటేసిన రాం చరణ్, ఉపాసన కామినేని

  • 2024-05-13T16:30:30+05:30

    • కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ కామెంట్స్

    • బీహార్‌లో 40 సీట్లు గెలుస్తాం: కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి నిత్యానంద రాయ్

    • ఉజియర్పూర్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తా

    • వయోజనులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు

  • 2024-05-13T16:16:26+05:30

    • చంద్రబాబు

    • యునైటెడ్ ఫ్రంట్ హయాంలో ప్రధాని పదవి చేపట్టాలని అడిగారు.

    • ప్రధాని పదవి చేపట్టా్ల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చారు.

    • ప్రధానమంత్రి పదవి వద్దనుకున్నా: చంద్రబాబు

  • 2024-05-13T16:12:36+05:30

    • పోలింగ్

    • మధ్యాహ్నం 3 గంటలకు వరకు 52.60 శాతం పోలింగ్ నమోదు

    • 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గల 96 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్

  • 2024-05-13T16:09:44+05:30

    • మాధవీలత

    • హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత అతి

    • పోలింగ్ కేంద్రంలో మహిళల బురఖా తీసి చూసిన మాధవీలత

  • 2024-05-13T15:57:30+05:30

    • జమ్ము కశ్మీర్

    • జమ్ముకశ్మీర్ పుల్వామాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    • పూల్వామాలో గల పోలింగ్ స్టేషన్లు మానిటరింగ్

    • పోలింగ్ సరళిని తెలుసుకుంటున్న అధికారులు

  • 2024-05-13T15:44:02+05:30

    • చంద్రబాబు

    • జగన్ శాడిస్ట్, విధ్వంసకుడు, లూటీ చేసే వ్యక్తి

    • ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు విసుర్లు

  • 2024-05-13T15:36:44+05:30

    • ఓటేసిన రేణుకా చౌదరి

    • ఖమ్మంలో ఓటేసిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

    • కేంద్రమంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి

    • ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకా చౌదరి

  • 2024-05-13T15:31:02+05:30

    పోలింగ్ శాతం

    • మధ్యాహ్నం 1 గంట వరకు దేశవ్యాప్తంగా 40.32 శాతం పోలింగ్ నమోదు

  • 2024-05-13T15:29:38+05:30

    శతృఘ్న సిన్హా

    • ముంబై, పాట్నాతోపాటు అసన్ సోల్ తనకు కీలకం అంటున్న శతృఘ్న సిన్హా

    • ప్రతి సందర్భంలో తనకు అసన్ సోల్ ప్రజలు అండగా నిలిచారు.

    • అందుకోసమే అసన్ సోల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగా: శతృఘ్న సిన్హా

  • 2024-05-13T15:22:25+05:30

    • అఖిలేష్ యాదవ్ కామెంట్స్

    • భారీ సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకోవాలి: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

    • కన్నౌజ్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తోన్న అఖిలేష్ యాదవ్

  • 2024-05-13T14:59:20+05:30

    యూసుఫ్ పఠాన్ కామెంట్స్

    • ఓటు వేసేందుకు యువత, మహిళలు ఆసక్తి కనబరిచారు.

    • పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడం సంతోషం కలిగించింది.

    • బహరాంపూర్‌లో తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయం: యూసుఫ్ పఠాన్

  • 2024-05-13T14:25:31+05:30

    శతృఘ్న సిన్హా విజయం తథ్యం..?

    • బెంగాల్ అసన్ సోల్ నియోజకవర్గంలో శతృఘ్న సిన్హా విజయం సాధిస్తారు.

    • శతృఘ్న సిన్హా గెలవాలని మనసారా కోరుకుంటున్నా: భార్య పునమ్ సిన్హా

  • 2024-05-13T14:18:20+05:30

    బెంగాల్‌లో టీఎంసీ నేతల దాదాగిరి..?

    • బెంగాల్‌లో కొన్ని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో టీఎంసీ నేతల దాదాగిరి

    • రహదారుల పైకి వచ్చి జనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు.

    • అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి డిమాండ్

  • 2024-05-13T14:12:12+05:30

    ఓటేసిన బీహార్ డిప్యూటీ సీఎం

    • లఖిసరాయ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా

    • తమ పార్టీ అభ్యర్థి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు: విజయ్ కుమార్ సిన్హా

  • 2024-05-13T13:48:22+05:30

    మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం

    • ఆంధ్రప్రదేశ్ 40.26 శాతం

    • బీహార్ 34.44 శాతం

    • జమ్ము కశ్మీర్ 23.57 శాతం

    • జార్ఖండ్ 43.80 శాతం

    • మధ్యప్రదేశ్ 48.52 శాతం

    • ఒడిశా 39.30 శాతం

    • తెలంగాణ 40.38 శాతం

    • ఉత్తర ప్రదేశ్ 39.68 శాతం

    • పశ్చిమ బెంగాల్ 51.87 శాతం

  • 2024-05-13T13:28:00+05:30

    • ఓటేసిన గుత్తా జ్వాల

    • ఓటు హక్కు వినియోగించుకున్న షట్లర్ గుత్తా జ్వాల

    • హైదరాబాద్‌లో ఓటు వేసిన గుత్తా జ్వాల

  • 2024-05-13T13:22:00+05:30

    • ఆర్జేడీ అభ్యర్థిని ఆశీర్వదించిన వృద్దురాలు

    • బీహర్‌లో గల శరన్ లోక్ సభ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి రోహిణి ఆచార్య పర్యటన

    • కారులో ఉన్న అభ్యర్థిని ఆశీర్వదించిన వృద్దురాలు

  • 2024-05-13T13:03:09+05:30

    అఖిలేష్ యాదవ్‌కు కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం..

  • 2024-05-13T12:21:59+05:30

    11 గంటల వరకు దేశ వ్యాప్తంగా 24.87 శాతం పోలింగ్ నమోదు..

    • ఆంధ్రప్రదేశ్ - 23.10%

    • బిహార్ - 22.54%

    • జమ్మూకశ్మీర్ - 14.94%

    • జార్ఖండ్ - 27.40%

    • మధ్యప్రదేశ్ - 32.38%

    • మహారాష్ట్ర - 17.51%

    • ఒడిశా - 23.28%

    • తెలంగాణ - 24.31%

    • ఉత్తరప్రదేశ్ - 27.12%

    • పశ్చిమ బెంగాల్ - 32.78

  • 2024-05-13T12:12:51+05:30

    Maharashtra: బీడ్ నియోజకవర్గంలో ఓటు వేసిన పంకజ్ ముండే..

    బీడ్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పంకజ్ ముండే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.

  • 2024-05-13T12:00:17+05:30

    11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ ఎంత శాతమంటే..

    👉 ఆదిలాబాద్ - 31.51 శాతం

    👉 భువనగిరి - 27.97 శాతం

    👉 చేవెళ్ల - 20.35 శాతం

    👉 హైదరాబాద్ - 10.70 శాతం

    👉 కరీంనగర్ - 26.14 శాతం

    👉 ఖమ్మం - 31.56 శాతం

    👉 మహబూబాబాద్ - 30.70 శాతం

    👉 మహబూబ్‌నగర్ - 26.99 శాతం

    👉 మల్కాజిగిరి - 15.05 శాతం

    👉 మెదక్ - 28.32 శాతం

    👉 నాగర్‌కర్నూల్ - 27.74 శాతం

    👉 నల్లగొండ - 31.21 శాతం

    👉 నిజామాబాద్ - 28.26 శాతం

    👉 పెద్దపల్లి - 26.17 శాతం

    👉 సికింద్రాబాద్ - 15.77 శాతం

    👉 వరంగల్ - 24.18 శాతం

    👉 జహీరాబాద్ - 31.83 శాతం

  • 2024-05-13T11:43:53+05:30

    ఓటు వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత ఓటు వేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్‌లో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 2024-05-13T11:37:42+05:30

    Telangana: ఓటు వేసిన కేసీఆర్

    • సిద్దిపేట : చింతమడకలో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు.

    • రాష్ట్రంలో పోలింగ్ భాగ జరుగుతోంది.. 65 శాతం మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది.

    • ఎన్నికల తరువాత దేశంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

  • 2024-05-13T11:30:50+05:30

    Telangana: తెలంగాణలో ఉదయం11 గంటల వరకు 24.25% ఓటింగ్

    తెలంగాణలో ఓటింగ్ క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదైంది.

  • 2024-05-13T11:25:40+05:30

    Telangana: ఓటు వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి..

    • దుబ్బాక మండలం పోతారం స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

    • రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

    • ఓటు హక్కు వినియోగించుకోని వారు భారత పౌరుడు కాదని చెప్పాలి

    • పట్టణ ప్రాంతాల్లో కనీసం 60% వినియోగించుకోవడం లేదు

    • క్రికెట్ మ్యాచ్ ఉంటే వంద శాతం చూస్తున్నారు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు

    • ఓటు వినియోగించుకోకుంటే దేశానికి హాని చేసినట్టే

  • 2024-05-13T11:24:28+05:30

    హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బిజెపి అభ్యర్థి మాధవి లత హల్చల్

    • ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు సూచనలు.

    • పలువురి ఓటర్లను ఫేసులను స్వయంగా తనిఖీ చేసిన మాధవి లత.

  • 2024-05-13T10:56:13+05:30

    Telangana: ఓటు వేసిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు..

    టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఓటు వేశారు. తన ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ ఆయన జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేశారు కోటా.

  • 2024-05-13T10:40:03+05:30

    Lok Sabha Election: దేశ వ్యాప్తంగా పోలింగ్ ఎంత శాతం నమోదైందంటే..

    • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్.

    • 10 రాష్ట్రాలోని 96 లోక్ సభ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్

    • ఉదయం 9 గంటలకు వరకు నమోదైన పోలింగ్ శాతం.

    • ఆంధ్రప్రదేశ్ -9.05శాతం

    • బీహార్ -10.18 శాతం

    • జమ్ము కాశ్మీర్-5.07 శాతం

    • మధ్యప్రదేశ్ -14.97శాతం

    • ఒడిషా -9.23 శాతం

    • తెలంగాణ -9.51 శాతం

    • మహరాష్ట్ర -6.45 శాతం

    • ఉత్తరప్రదేశ్- 11.67 శాతం

    • వెస్ట్ బెంగాల్ -15.24 శాతం

    • జార్ఖండ్ -11.78 శాతం

  • 2024-05-13T10:24:44+05:30

    Maharashtra: మహారాష్ట్రలో మెజార్టీ సీట్లు గెలుస్తాం: ప్రకాశ్ జవదేకర్

    మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 41 సీట్లు వచ్చాయని.. కానీ, ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ వేవ్ ఉందని.. ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించి ప్రధాని మోడీకి ఓటు వేస్తున్నారని జవదేకర్ అన్నారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు జవదేకర్.

  • 2024-05-13T09:04:14+05:30

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

    👉 కిషన్ రెడ్డి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత నిరంజన్

    👉 కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుని మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా నరేంద్రమోదీ పేరు ఉచ్చరించారన్న కాంగ్రెస్ నేత నిరంజన్

    👉 కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న నిరంజన్

  • 2024-05-13T09:02:55+05:30

    ఓటు వేసిన సాక్షి మహారాజ్..

  • 2024-05-13T08:59:00+05:30

    ఓటు వేసిన ఫరూక్ అబ్దుల్లా..

    జేకేఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుండి అగా సయ్యద్ రుహుల్లా మెహదీని, PDP తరపున వహీద్-ఉర్-రెహ్మాన్ పారా, J&K అప్నీ పార్టీ తరపున మహ్మద్ అష్రఫ్ మీర్ పోటీ చేశారు.

  • 2024-05-13T08:58:23+05:30

    Telangana: ఓటు హక్కు వినియోగించుకున్న బండి సంజయ్..

    👉 కరీంనగర్ జ్యోతినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న బిజేపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్.

    👉 అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉంది

    👉 ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

    👉 దేశ ధర్మ రక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలు.

    👉 కొందరు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు.

    👉 ప్రలోబాలకు లొంగకుండా ఓటు వేయండి

    👉 ప్రజలంతా పోలింగ్ లో పాల్గొనాలి.

    👉 ఓటు వేయడం తోపాటు పది మందితో ఓటు వేయించాలి.

    👉 ఓటర్లకు డబ్బులు మద్యం పంచి ఓట్లు వేయించుకోవడం మంచిది కాదు.

    👉 స్వేచ్చగా ఓటు వేయండి

  • 2024-05-13T08:47:03+05:30

    ఓటు వేసిన సినీ డైరెక్టర్ తేజ

    టాలీవుడ్ మూవీ డైరెక్టర్ తేజ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

  • 2024-05-13T08:14:12+05:30

    Telangana: రండి.. ఓటు వేయండి.. ప్రజలకు చిరంజీవి విజ్ఞప్తి..

    మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు మన హక్కు.. రండి.. ఓటు వేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు చిరంజీవి.

  • 2024-05-13T08:10:12+05:30

    ఓటేసిన అసదుద్దీన్.. తొలిసారి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

  • 2024-05-13T07:53:45+05:30

    Telangana: ఓటు వేసిన వెంకయ్య నాయుడు దంపతులు..

    భారత మాజీ రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆయన సతీమణి ఉషా నాయుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

  • 2024-05-13T07:49:53+05:30

    ఓటు హక్కును వినియోగించుకున్న మాధవీ లత..

    Telangana: హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె.. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

  • 2024-05-13T07:44:32+05:30

    New Delhi: ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించండి: ప్రధాని మోదీ

    ‘లోక్‌సభ ఎన్నికల 4వ విడతలో ఈరోజు 10 రాష్ట్రాలు, యూటీలలోని 96 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని, యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు కూడా ఈ ఓటింగ్‌కు బలం చేకూరుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం మరియు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం!’ అని మోదీ పోస్ట్ చేశారు.

  • 2024-05-13T07:36:01+05:30

    ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చున్న సెలబ్రిటీస్..

  • 2024-05-13T07:33:03+05:30

    Telangana: ఓటు హక్కు వినియోగించుకున్న అల్లూ అర్జున్..

    టాలీవుడ్ స్టార్ హీరో అల్లూ అర్జున్ తన ఓటు హక్కును వినియోగించున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

  • 2024-05-13T07:20:32+05:30

    Telangana: పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఎన్టీఆర్..

    లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్టీఆర్ పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునోనున్నారు.

  • 2024-05-13T07:18:08+05:30

    Telangana: మెదక్ పార్లమెంట్ స్థానంలో పోలింగ్ ప్రారంభం

    • మెదక్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్న 44 మంది అభ్యర్థులు

    • మొత్తం 2124 పోలింగ్ కేంద్రాలు, అత్యధికంగా పటాన్ చెరులో 411 పోలింగ్ కేంద్రాలు, 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

    • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

    • పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లో 18 లక్షల 28 వేల 209 మంది ఓటర్లు

  • 2024-05-13T07:16:57+05:30

    Jammu and Kashmir: భారీ భద్రత మధ్య జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన పోలింగ్..

    GMS హంజీ గుండ్ పోలింగ్ స్టేషన్, బూత్ నంబర్ 60 వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రారంభమైంది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, PDP అభ్యర్థి వహీద్ ఉర్ రెహ్మాన్ పారా, అప్నీ పార్టీకి చెందిన మహ్మద్ అష్రఫ్ మీర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

  • 2024-05-13T07:06:23+05:30

    దేశ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్..

    దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమ హక్కును వినియోగించుకునేందుకు ముందుగానే పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్తున్నారు ఓటర్లు.

  • 2024-05-13T06:17:10+05:30

    Telangana: సీఎం ఇలాకాలో ప్రారంభమైన మాక్ పోలింగ్..

    తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్‌లో పోలింగ్ బూత్ నెంబర్ 237 మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీ చందర్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

  • 2024-05-13T06:00:45+05:30

    Andhra Pradesh: జగన్ ఓటు వేసేది ఇక్కడే..

    కడప నియోజకవర్గంలోని జయమహల్‌ అంగన్‌వాడీ పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 138లో పోలింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పోలింగ్‌ బూత్‌‌లోనే ఓటు వేయనున్నారు. ఈ స్థానం నుంచి ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ షర్మిల, ఎన్‌డీఏ నుంచి టీడీపీ అభ్యర్థి చడిపిరాళ్ల భూపేశ్‌ సుబ్బరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి కడప నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు.

  • 2024-05-13T05:59:18+05:30

    నాలుగో విడతలో బరిలో ఉన్న కీలక నేతలు వీరే..

    లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా చాలా మంది అగ్రనేతలు పోటీ చేస్తున్నారు. ఈ విడతలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(కనౌజ్), ఎన్‌సిపి నుంచి ఒమర్ అబ్దుల్లా (శ్రీనగర్), కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్), నిత్యానంద రాయ్ (ఉజియార్‌పూర్), కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి (బహరంపూర్), తృణమూల్‌కు చెందిన మహువా మోయిత్ర (ఖువా మోయిత్ర) ఉన్నారు. అలాగే, శతృఘ్నన్ సిన్హా (అసన్సోల్), AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), AP CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (కడప) నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.

  • 2024-05-13T05:54:32+05:30

    Kalahandi, Odisha: ఒడిశాలో ప్రారంభమైన మాక్ పోలింగ్..

    భవానీపటానా అసెంబ్లీ నియోజకవర్గం, కలహండి లోక్‌సభ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ నంబర్ 136లో మాక్ పోల్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నాలుగో విడతలో 4 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.

  • 2024-05-13T05:45:07+05:30

    Telangana Lok Sabha Elections: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్.

    👉 తెలంగాణలో కాసేపట్లో ప్రారంభం కానున్న మాక్ పోలింగ్.

    👉 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.

    👉 రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ

    👉 17 లోక్ సభ స్థానాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు.

    👉 రాష్ట్ర వ్యాప్తంగా 35, 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు .

    👉 2000 పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక నిఘా.

    👉 రాష్ట్రవ్యాప్తంగా 13 నియోజకవర్గాలను సమస్యత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈసీ.

    👉 13 నక్సల్స్‌ ప్రభావిత అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌.

    👉 పోలింగ్ కోసం ఒక లక్షా తొమ్మిది వేల బ్యాలెట్ యూనిట్లు

    👉 గత ఎన్నికల్లో 5000 పోలింగ్ కేంద్రాలను తక్కువ పోలింగ్ శాతం నమోదు.

    👉 ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1లక్ష 88 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ పూర్తి.

    👉 హోమ్ ఓటింగ్ ద్వారా ఓటేసిన 20163మంది ఓటర్లు.

    👉 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.

    👉 పోలింగ్ కోసం విధుల్లో మొత్తం 2 లక్షల 94 వేల మంది ఉద్యోగులు.

    👉 ఎన్నికల కోసం భారీ బందోబస్తు

    👉 164 కేంద్ర బలగాల తో పాటు 72,000 మంది పోలీసులు, ఇతర రాష్ట్రాల సిబ్బందితో కూడా బందోబస్తు.

  • 2024-05-13T05:30:37+05:30

    Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా మే 13న సోమవారం నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 స్థానాల్లో పోలింగ్ జరగనుంది . ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలు, ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది. యూపీలో 13, మహారాష్ట్రలో 11, ఎంపీ, బెంగాల్‌లో 8, బీహార్‌లో 5, ఒడిశా 4, జార్ఖండ్‌లో 4గు, జమ్మూ & కాశ్మీర్‌లో 1స్థానానికి పోలింగ్ జరగనుంది.

  • 2024-05-13T02:55:12+05:30

    ఓటు వేసిన బాలకృష్ణ

    • సతీసమేతంగా ఓటు వేసిన బాలకృష్ణ

    • హిందూపూరంలో ఓటు హక్కు వినియోగించుకున్న వసుంధర, బాలకృష్ణ