Home » Lok Sabha Polls 2024
ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని సైతం ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.
మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18,19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు..
2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్‌గాంధీని ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ వ్యవహరించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడం పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ నాయకత్వంలో తిరిగి జాతీయ స్రవంతిలో పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.