Home » Machilipatnam
Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: జిల్లాలోని బందరు తాలుకా పోలీస్‌స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని, ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఐపీపీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని దౌర్జన్యానికి దిగారు.
జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.
మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లు అయింది.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
Andhrapradesh: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కన పెట్టేసిన వాలంటీర్లు.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై వేటు వేస్తోంది.
Andhrapradesh: జిల్లాలోని మచిలీపట్నంలో ప్లెక్సీల రాజకీయం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పేర్ని నాని మౌఖిక ఆదేశాలతో టీడీపీ ప్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి..
గుంటూరు జిల్లా: ఏపీ ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించాలన్నదే తమ లక్ష్యమని, పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని జెండా సభ ద్వారా జనసైనికులు చాటి చెబుతారని, మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటు స్థానాలు నుంచి జెండా సభకు తరలి వెళ్తున్నామని ఎంపీ బాలశౌరి వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి రోడ్ల మీద పడి జనసేన ఫ్లెక్సీలనుపేర్ని నాని అనుచరులు తొలగించారు. మొన్న జనసేన దిమ్మను తొలగించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. నిన్న అర్ధరాత్రి జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు పడ్డారు.