Home » Maharashtra
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్‌కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్‌తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఏక్నాథ్ శిండే సారథ్యంలోని శివసేన-బీజేపీ-ఎన్సీపీ కూటమి ‘మహాయుతి’లో చిచ్చు రేగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనే బాధ్యత దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరి, చంద్రశేఖర్ బవాంకులేకి అప్పగించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అంటే నిన్నటితో ముగిసింది. బుధవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరించుకునే గడువు నవంబర్ 4వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో.. నవంబర్ 20వ తేదీన జరగనుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. చివరి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చివరి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయి. మొత్తం ఎన్ని వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బారామతి నుంచే పోటీ చేస్తున్న అజిత్ పవార్ సోమవారంనాడు నామినేషన్ అనంతరం కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ శరద్ పవార్‌ను తప్పుపట్టారు. దీనిపై శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు. కుటుంబం విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ నేర్చించ లేదన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు నేడు చివరి రోజు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్ల పంపకం, అభ్యర్థుల తుది ప్రకటనలు ఇంకా పూర్తి కాలేదు. అధికార, విపక్ష రెండు కూటముల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సోమవారం 25 మంది అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది.
మహాయుతి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలేనని, ఏ పథకాన్ని ఆపేసే ప్రసక్తి లేదని అన్నారు.