Share News

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం తేదీ ఎప్పుడంటే

ABN , Publish Date - Nov 23 , 2024 | 08:07 PM

ప్రభుత్వం ఏర్పాట్లు ప్లాన్‌పై చర్చించేందుకు అజిత్ పవార్, షిండే, దేవేంద్ర ఫడ్నవిస్‌లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి పిలుపు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ఉదయం కలుసుకున్నారు.

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం తేదీ ఎప్పుడంటే

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో 'మహాయుతి' కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ జరుగుతుండగా, మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడనే అంశం కూడా తెరపైకి వచ్చింది. నవంబర్ 26వ తేదీన వాంఖడే స్టేడియంలో 'మహాయుతి' నేతలు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తాజా సమాచారం. దీనికి ఒకరోజు ముందు అంటే నవంబర్ 25న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగనుంది.

Maharashtra Elections: ‘మహా’ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. బీజేపీ కొత్త తిప్పలు


రేసులో ఆయనే ముందంజ

ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగించాలని షిండే శివసేన నేతల నినాదంగా ఉండగా, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం నేతలు తమ నేతకు సీఎం పట్టం కట్టాలంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. మరోవైపు, బీజేపీ ప్రచారసారథిగా అత్యధిక ర్యాలీలు నిర్వహించి ఆ పార్టీకి అత్యధిక సీట్లు సాధించిపెట్టడంతో పాటు, కూటమి నేతల విజయానికి కృషి చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇచ్చితీరాలని బీజేపీ నేతలు బలమైన వాదన వినిపిస్తున్నారు. కాబోయే సీఎం ఫడ్నవిస్ అంటూ పోస్టర్లు కూడా వెలిసాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ ముందు స్థానంలో నిలుస్తున్నారు.


అమిత్‌షా నుంచి పిలుపు

కాగా, ప్రభుత్వం ఏర్పాట్లు ప్లాన్‌పై చర్చించేందుకు అజిత్ పవార్, షిండే, దేవేంద్ర ఫడ్నవిస్‌లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి పిలుపు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ఉదయం కలుసుకున్నారు. పలువురు బీజేపీ నేతల సమక్షంలో భూపేంద్ర యాదవ్‌ను కూడా ఆయన కలిసారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: 'మహా' విజయంపై మోదీ ఫస్ట్ రియాక్షన్

Maharashtra Results: లక్షా 20 వేల ఆధిక్యంతో సీఎం షిండే గెలుపు

Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 08:10 PM