Share News

PM Modi: బీజేపీ విజయోత్సవంలో మోదీ.. విభజన శక్తులు, కుటుంబవాదంపై చురకలు

ABN , Publish Date - Nov 23 , 2024 | 09:26 PM

గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

PM Modi: బీజేపీ విజయోత్సవంలో మోదీ.. విభజన శక్తులు, కుటుంబవాదంపై చురకలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం, ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో పార్టీ తిరిగి గట్టి పట్టు సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు విజయోత్సవం నిర్వహించారు. ఈ సంబరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ సాధించిన విజయంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయం ఇదని, విభజన శక్తులు, ఆనువంశిక రాజకీయలపై సామాజిక న్యాయం సాధించిన విజయమని అన్నారు.

Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం తేదీ ఎప్పుడంటే


''ఈరోజు మనం మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నాం. మహారాష్ట్రలో ప్రగతి, సుస్థిరతకు ఓటు వేశారు. అబద్ధాలు, మోసాలు, ప్రతికూల రాజకీయాలను చిత్తు చేశారు'' అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ అన్నారు. గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని అన్నారు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిపై ఎంతో నమ్మకముంచి అఖండ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు, రైతులకు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.


జార్ఖాండ్‌ పార్టీ ఫలితాలపై మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వాగ్దానం చేశారు. జార్ఖాండ్ ప్రగతికి అవిశ్రాంతంగా పని చేస్తామని, ఈ లక్ష్య సాధనకు ప్రతిఒక్క బీజేపీ కార్యకర్త కూడా కట్టుబడి ఉంటారని భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: 'మహా' విజయంపై మోదీ ఫస్ట్ రియాక్షన్

Maharashtra Results: లక్షా 20 వేల ఆధిక్యంతో సీఎం షిండే గెలుపు

Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 09:26 PM