Home » Mamata Banerjee
ధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు! దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం లేదు!! పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు! వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు.
నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
ట్రైనీ వైద్యురాలు హత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన భయానకమైనదన్నారు. అలాగే హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు విస్తుపోయే అంశాలను వివరించారు. సంజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే.. ఏ మాత్రం బాధ పడలేదని, పశ్చాతాపం అనేది అతనిలో ఏ కోశానా కనిపించలేదని పేర్కొన్నారు.
ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.
కోల్కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎ్సఎఫ్ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..
పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం వివాదాల్లోనే ఉంటారు. అందుకు గల్లీ స్థాయి నేత నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ వరకు అందుకు ఏ ఒక్కరు మినహాయింపు కాదన్నది సుస్పష్టం. దీంతో కేంద్రంలోని అధికార పార్టీతో చురకలంటించుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొంది.
జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని, తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.