Share News

Shatrughan Sinha: 'బెంగాల్ తగలబడితే' వ్యాఖ్యలను సమర్ధించిన షాట్‌గన్

ABN , Publish Date - Aug 31 , 2024 | 07:17 PM

బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.

Shatrughan Sinha: 'బెంగాల్ తగలబడితే' వ్యాఖ్యలను సమర్ధించిన షాట్‌గన్

కోల్‌కతా: బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా (Satrughan Sinha) సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.


పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల జరిగిన టీఎంసీ ఛాత్ర పరిషత్‌ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవంలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తమ రాష్ట్రంలో అలజడులు సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, బెంగాల్‌ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిసా కూడా కాలిపోతాయని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు బెంగాల్‌ను బంగ్లాదేశ్ అంటున్నారని చెబుతూ, తాను బంగ్లాదేశ్‌ను అభిమానిస్తానని, వాళ్లు మనలాగానే మాట్లాడతారని, మన సంస్కృతిని పంచుకుంటారని చెప్పారు. అయితే బంగ్లాదేశ్, భారత్ వేర్వేరు దేశాలని గుర్తు చేశారు. మోదీ తమ పార్టీని (బీజేపీ) బెంగాల్‌ను తగలబెట్టడానికి ఉసగొల్పుతున్నారని ఆరోపించారు. బెంగాల్ తగలబడితే ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలు కూడా కాలిపోతాయన్నారు.

బెంగాల్‌ తగలబడితే అసోం కాలిపోద్ది: మమత


ఆమె మాటల్లో మెచ్యూరిటీ ఉంది..

కాగా, మమత దీదీ చెప్పిన విషయాలను వింటే, ఎంతో పరిణితితో ఆమె వ్యహరించారని తెలుస్తుందని శత్రుఘ్నుసిన్హా అన్నారు. కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని, సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అలాంటి తరుణంలో ఆ ఘటనపై ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రభావం ఒక్క పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాదనే అర్ధంలో మమత మాట్లాడారని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 07:17 PM