Home » Mancherial
ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనంతరం వాటి అమలును విస్మరించిందని, ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారంశ్రీకృష్ణ ఫంక్షన్హాలులో నిర్వహించిన జిల్లా పార్టీ మూడో మహాసభలకు ఆయన అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం 6, 21 వార్డుల్లో, తాళ్లగురిజాలలో కొనసాగుతున్న సర్వేను ఆర్డీవో హరికృష్ణ, డీపీవో వెంకటేశ్వర్రావుతో కలిసి పరిశీలించారు.
వీధి శునకా లకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడం ద్వారా వాటి వ్యాప్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అం డాళమ్మ కాలనీ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పశు సంరక్షణ కేంద్రం పేరుతో ఆస్పత్రి భవనాన్ని నిర్మిం చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సమీకృత పథకాల నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టాలని దిశ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీఆర్డీవో కిషన్లతో కలిసి దిశ (డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ త్రైమాసిక సమావేశానికి హాజరయ్యారు.
సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రూ. 10,40,500 విలువ గల 50 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్ధిక మేలు జరుగు తుందన్నారు.
వివిధ ధ్రువపత్రాలకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం హాస్టల్లో విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించగా 160 మంది విద్యార్థినులు తిన్నారు.
భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన వివరాల నమోదు పోర్టల్ రెండు నెలల నుంచి నిలిచిపోయాయి. దీంతో వారికి అందాల్సిన పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ సహాయ అధికారి పరిధిలో వివిధ రంగాలకు చెందిన 62,604 మంది కార్మికులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. హాస్టల్లో రోజువారీలాగానే ఉదయం విద్యార్థినులకు కిచిడీ, చారు తయారు చేసి అందించారు.
పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు.