Home » Manchu Family
ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానన్నార మంచు మనోజ్. ఈ మంచు మనోజ్.. ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా? మంచి కోసం నిలబడుతున్నాడా? అనేది ఈ రోజు సాయంత్రం తాను నిర్వహించనున్న ప్రెస్ మీట్లో స్పష్టమవుతుందన్నారు. తన తండ్రి మోహన్ బాబుపై గన్ పెట్టి కాల్చే వినయ్‌కు, మా అన్నయ్య విష్ణుకు ఈ రోజు సాయంత్రం ప్రతిది వివరిస్తాన్నారు. తనకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న అన్ని విషయాలు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసే ప్రెస్ మీట్లో వివరిస్తానని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెల్లడించారు. ఇంటి నిండా కార్లు.. ఇంటి నిండా మనుషుల ఉన్నారని.. కానీ ఆనారోగ్యానికి గురైన వ్యక్తిని 108లో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
Manchu Manoj vs Mohanbabu Controversy: మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మంచు మనోజ్ బుధవారం నాడు నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు.
మంచు కుటుంబం వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంతకు ముందే మీడియాతో మాట్లాడిన మనోజ్ సంచలన విషయాలు చెప్పారు.
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మంచు మనోజ్, విష్ణు రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు.
మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.