Share News

Mohanbabu: ఆ రోజు ఏం జరిగిందంటే.. మొదటిసారి స్పందించిన మోహన్‌బాబు

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:23 PM

ఆడియో సందేశాన్ని మోహన్‌ బాబు విడుదల చేశారు. ఆరోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం కుదుటుపడటంతో ..

Mohanbabu: ఆ రోజు ఏం జరిగిందంటే.. మొదటిసారి స్పందించిన మోహన్‌బాబు
Mohan Babu

సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో ఆయన ఇంటివద్దకు వెళ్లిన జర్నలిస్టుపై ఆయన దాడి చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరగుతున్న వేళ.. ఈ ఘటనపై తొలిసారి మోహన్ బాబు స్పందించారు. ఆడియో సందేశాన్ని మోహన్‌ బాబు విడుదల చేశారు. ఆరోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం కుదుటుపడటంతో ఆయన ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.


జర్నలిస్ట్‌పై దాడి చేశారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందింస్తూ జర్నలిస్టులను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదన్నారు. మొదట తాను జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని తెలిపారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. విజయవాడలో తాను ఒకపప్పుడు ఉద్యోగినేనని గుర్తు చేశారు. తన ఇంటికి వచ్చినవారు మీడియా వారా వేరే వారు ఎవరైనా వచ్చారా అనే విషయం తనకు తెలియదన్నారు. జరిగిన సంఘటనకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని, ఆ జర్నలిస్టు తనకు తమ్ముడులాంటి వారన్నారు. అన్ని విషయాలను పైన భగవంతుడు చూస్తున్నారని మోహన్ బాబు తెలిపారు.


తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవడంలేదన్నారు. జర్నలిస్టులను కొట్టడం మాత్రం తప్పే అయినప్పటికీ.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని మోహన్‌బాబు తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు. మైకులు లాక్కుని కొట్టేంత మూర్ఖుడిని తాను కాదన్నారు. పోలీసులంటే తనకు ఎంతో ఇష్టమని, వారు శాంతి భద్రతలను కాపాడాలన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మోహన్‌బాబు తెలిపారు. ఇది న్యాయమా.. అన్యాయమా అనేది ఆలోచించాలన్నారు.


అసలు ఏం జరిగిందంటే..

తనపై తండ్రి మోహన్ బాబు, అతడి అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత మంచు మోహన్‌బాబు తన కుమారుడు తనపై దాడికి పాల్పడ్డారంటూ మనోజ్, మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం రచ్చకెక్కడంతో మీడియా ఈ అంశంపై ఫోకస్ చేసింది. మోహన్‌బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం రేపడంతో అసలు ఏం జరిగిందనే దానిపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తన ఆడియో సందేశంలో పూర్తి వివరాలను మోహన్ బాబు వివరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 12 , 2024 | 06:23 PM