Share News

Mohan Babu:మోహన్‌బాబును విచారిస్తోన్న పోలీసులు

ABN , Publish Date - Dec 14 , 2024 | 02:52 PM

తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మంచు మోహన్ బాబుకు చుక్కెదురు అయింది. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరుకాక తప్పలేదు.

Mohan Babu:మోహన్‌బాబును విచారిస్తోన్న పోలీసులు
Tollywood Actor MohanBabu

హైదరాబాద్, డిసెంబర్ 14: కలెక్షన్ కింగ్ మోహన్ బాబును పహడి షరీఫ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నానని.. కొద్దిగా కోలుకున్న అనంతరం విచారణ చేయాలని పోలీసులను మోహన్ బాబు కోరారు. అందుకు వారు నిరాకరించారు. తమ విచారణకు సహకరించాలంటూ మోహన్ బాబును వారు కోరారు. దీంతో పోలీసుల సూచనను మోహన్ బాబు అంగీకరించారు. ఇక గన్ ఇవ్వాలంటూ మోహన్ బాబును పోలీసులు కోరారు. ఈ రోజు సాయంత్రం గన్ ప్రోడ్యూస్ చేస్తానంటూ పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చారు.

Also Read: అమిత్ షాకి అరవింద్ కేజ్రీవాల్ లేఖాస్త్రాం


మరోవైపు పోలీసుల విచారణకు హాజరుకాకుండా.. మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ ప్రచారం అయితే ఊపందుకొంది. దీనిపై మోహన్ బాబు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. అస్వస్థత కారణంగా తన నివాసంలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ ఖాతా వేదికగా మోహన్ బాబు స్పందించిన కొన్ని గంటలకే ఆయన్ని పోలీసులు విచారిస్తుండడం గమనార్హం.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన

Also Read: తాటిపండు (తాటికాయ) వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఇంకోవైపు.. మంచు ఫ్యామిలీలో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏదో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు.

Also Read: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

Also Read: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా


ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో ఓ మీడియా ఛానెల్ జర్నలిస్ట్‌పై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్‌లు నిరసన బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు అయింది. ఇంతలో మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి..బుధవారం సాయంత్రం.. అంటే డిసెంబర్ 11వ తేదీ మీడియా ముందుకు వచ్చి.. అన్ని విషయాలు వివరిస్తానని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు అయింది.

Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు


హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోనేందుకు మోహన్ బాబు అజ్జాతంలోకి వెళ్లారంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా జరుగుతోంది. అలాంటి వేళ.. తాను ఎక్కడికి వెళ్లలేదంటూ మోహన్ బాబు ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. అనంతరం ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 02:55 PM