Home » Medak
నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
హత్య తానే చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే నేరనిర్ధారణకు సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నేరాంగీకార స్టేట్మెంట్కు అనుగుణంగా సాక్ష్యాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఉండాలని పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిన్న(శుక్రవారం) ఒకే రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి కేటుగాళ్లు రూ.80లక్షలు దోచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్లోని జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా.. ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది.
రాష్ట్రంలో పంచాయతీలకు సరిపడా నిధులు ఇవ్వడంలేదని, దాంతో పల్లెలు ఏడుస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
పరిశ్రమల శాఖకు ఈ సారి బడ్జెట్టులో నిరుటితో పోలిస్తే తక్కువ కేటాయింపులు దక్కాయి. నిరుడు రూ. 4037కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2762కోట్లు కేటాయించారు. ఈ సారి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అవసరం పెద్దగా లేకపోవడంతో కేటాయిం పులు తగ్గాయి.
నిత్యం ఏదో ఒక అంశంలో ప్రజల్ని కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు, బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి మరికొందరు, ఆన్ లైన్ మోసాలకు ఇంకొందరు బలైపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్ల ద్వారా యువతీయువకులు సైతం మోసపోతున్నారు. మీ పేరుతో లాటరీ తగిలిందని ఆ నగదు మెుత్తాన్ని మీ ఖాతాలో వేయాలంటే చెప్పిన లింక్పై క్లిక్ చేయాలంటూ మరికొందరిని బురిడీ కొట్టిస్తున్నారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్ను విడుదల చేసేందుకు లంచం తీసుకొని హావేళీ ఘనపూర్ ఎస్ఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కారు.
జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏసీబీ వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ హావేలి ఘన్పూర్ ఎస్సై రెండ్ హ్యాండెడ్గా ఏసీబీ వలకి చిక్కారు. గత నెల 26న అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు.